Telugu Global
Cinema & Entertainment

Thug Life | కమల్ కొత్త సినిమా పేరు ఇదే

Kamal Hassan - తన 234వ చిత్రాన్ని మణిరత్నం దర్శకత్వంలో చేస్తున్నారు కమల్. ఈ సినిమాకు థగ్ లైఫ్ అనే టైటిల్ పెట్టారు.

Thug Life | కమల్ కొత్త సినిమా పేరు ఇదే
X

ఉలగనాయగన్ కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం 1987లో విడుదలైన వారి కల్ట్ యాక్షన్ డ్రామా ‘నాయకుడు’ తర్వాత మళ్లీ కలిశారు. 36 సంవత్సరాల తర్వాత లెజెండ్స్ ఇద్దరు పాన్ ఇండియా మూవీ కోసం చేతులు కలిపారు. కెరీర్ లో కమల్ కు ఇది 234వ చిత్రం.

ఇటివలే గ్రాండ్ గా ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ టైటిల్ ని తాజాగా అనౌన్స్ చేశారు. ఈ మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్ స్టర్ మూవీకి 'థగ్ లైఫ్' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఎక్స్ ట్రార్డినరీ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులని కట్టిపడేసింది. వీడియోలో కమల్ హసన్ యాక్షన్ అవుట్ స్టాండింగ్ గా ఉంది. ఫైట్ సీక్వెన్స్ కమల్ హాసన్ పర్ఫార్మ్ చేసిన బ్రిలియంట్ మార్సల్ ఆర్ట్స్ అదిరిపోయాయి.

మణిరత్నం టేకింగ్, రవి కె చంద్రన్ కెమెరా పనితనం అద్భుతంగా ఉన్నాయి. దీనికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్. టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.

కమల్ హసన్, మణిరత్నం కల్ట్ క్లాసిక్ కాంబోలో వస్తున్న చిత్రం కావడం, అలాగే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'విక్రమ్' తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో 'థగ్ లైఫ్' పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వచ్చింది వీడియో.

ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ లో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, జయంరవి, బ్యూటీఫుల్ త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

First Published:  6 Nov 2023 5:06 PM GMT
Next Story