Telugu Global
Cinema & Entertainment

Bharateeyudu 2 | భారతీయుడు-2 వచ్చేస్తున్నాడు

Bharateeyudu 2 - కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా భారతీయుడు-2. జూన్ లో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

Bharateeyudu 2 | భారతీయుడు-2 వచ్చేస్తున్నాడు
X

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ పై వస్తున్న సినిమా ‘భార‌తీయుడు 2’. 1996లో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ సినిమా తెలుగులో ‘భార‌తీయుడు’గా విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే మూవీకి సీక్వెల్‌గా ‘భార‌తీయుడు 2’ వస్తోంది.

అందరి అంచ‌నాలను మించి భార‌తీయుడు 2ను విజువ‌ల్ వండ‌ర్‌గా తెరకెక్కించాడు శంకర్. అవినీతికి వ్య‌తిరేకంగా పోరాడే స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సేనాప‌తిగా క‌మ‌ల్ హాస‌న్ ప‌వ‌ర్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఇవ్వ‌టానికి రెడీ అయ్యారు. ఈ సినిమా శ‌ర‌వేగంగా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాను జూన్ నెల‌లో విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించిన పోస్ట‌ర్‌ను కూడా మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. తెల్ల‌టి ధోతి, కుర్తాలో క‌మ‌ల్ హాస‌న్ క‌నిపిస్తున్నారు. అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం అంటే ఎంత స్వ‌చ్చంగా ఉండాలో అంత‌టి స్వ‌చ్చ‌త సేనాపతిలో కనిపిస్తోంది. జీరో టాల‌రెన్స్ (త‌ప్పును అస్స‌లు భ‌రించ‌లేను) అని పోస్ట‌ర్‌పై ఉన్న లైన్ చాలా ప్ర‌భావ‌వంతంగా ఉంది. క‌మ‌ల్ హాస‌న్ కూడా సీరియ‌స్‌, ఇన్‌టెన్స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు.

క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు.

First Published:  6 April 2024 4:27 PM GMT
Next Story