Telugu Global
Cinema & Entertainment

Thug Life | సెట్స్ పైకొచ్చిన కమల్-మణిరత్నం కాంబో

Thug Life - దాదాపు 30 ఏళ్ల తర్వాత మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు కమల్ హాసన్. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది.

Thug Life | సెట్స్ పైకొచ్చిన కమల్-మణిరత్నం కాంబో
X

ఉలగనాయగన్ కమల్ హాసన్, లెజెండ్ దర్శకుడు మణిరత్నం దాదాపు 3 దశాబ్దాల తర్వాత కలిసిన సంగతి తెలిసిందే. 1987లో వీళ్లిద్దరి కాంబోలో ‘నాయకుడు’ వచ్చింది. కల్ట్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరు లెజెండ్స్ కలిశారు. 36 సంవత్సరాల తర్వాత ‘థగ్ లైఫ్’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెట్స్ పైకి వచ్చింది.

ఇప్పటికే ఈ చిత్ర టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది. తాజాగా సినిమా షూటింగ్ ప్రారంభమైయింది. సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలియజేస్తూ ఒక ప్రత్యేక వీడియోను మేకర్స్ పంచుకున్నారు. ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ లో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, జయంరవి, గౌతం కార్తిక్, జోజు జార్జ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

కమల్ హసన్, మణిరత్నం కల్ట్ క్లాసిక్ కాంబోలో వస్తున్న చిత్రం కావడం, అలాగే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'విక్రమ్' తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో 'థగ్ లైఫ్' పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్‌లు తమ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

లెజెండరీ కంపోజర్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అన్బు-అరీవ్ స్టంట్స్ అందిస్తున్నారు.

First Published:  25 Jan 2024 5:23 PM GMT
Next Story