Telugu Global
Cinema & Entertainment

KalyanRam | కొత్త సినిమా ప్రకటించిన కల్యాణ్ రామ్

KalyanRam - తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రకటించాడు హీరో కల్యాణ్ రామ్. ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి అనే కొత్త దర్శకుడు వర్క్ చేస్తాడు.

KalyanRam | కొత్త సినిమా ప్రకటించిన కల్యాణ్ రామ్
X

టాలెంట్‌ను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుంటాడు కళ్యాణ్ రామ్. యువ దర్శకులు, వైవిధ్యమైన కథలతో ఆయన చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఇప్పుడు కళ్యాణ్ రామ్, ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తన 21వ చిత్రానికి సైన్ చేశాడు.

"అలా ఎలా" అనే ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీని నిర్మించిన తర్వాత అశోక క్రియేషన్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ ని టేకప్ చేస్తోంది. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది.

ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ లో భాగంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూస్తే ఇది మాస్-యాక్షన్ సినిమా అనే విషయం అర్థమౌతోంది.

కళ్యాణ్ రామ్‌ని మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో చూపించడానికి ప్రదీప్ చిలుకూరి ఆకట్టుకునే కథను రాశాడు. డెవిల్ తర్వాత కళ్యాణ్ రామ్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే.

First Published:  6 July 2023 4:54 AM GMT
Next Story