Telugu Global
Cinema & Entertainment

Lambasingi | లంబసింగి ప్రత్యేకత తెలుసా?

Lambasingi Movie - లంబసింగి గురించి చాలామందికి తెలుసు. ఇప్పుడు అదే టైటిల్ తో సినిమా వస్తోంది. ఈ సినిమాకు కూడా ఓ ప్రత్యేకత ఉంది.

Lambasingi | లంబసింగి ప్రత్యేకత తెలుసా?
X

వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేష‌న్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడీ ఊరి పేరుతో ఓ సినిమా రాబోతోంది.

‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్ కృష్ణ ప్రజెంటర్. భరత్‌ రాజ్ ను హీరోగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి హీరోయిన్ గా ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’.. అనేది ట్యాగ్ లైన్.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లంబసింగి చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మొదటిపాట ‘నచ్చేసిందే నచ్చేసిందే…’ కు ప్రేక్షకుల నుండి మంచి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుండి వయ్యారి గోదారి సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. జవేద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ కు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు. మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా లంబసింగి సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది.

First Published:  8 March 2024 9:03 AM GMT
Next Story