Telugu Global
Cinema & Entertainment

Satyabhama | కాజల్ మూవీ షూటింగ్ అప్ డేట్స్

Satyabhama - కాజల్ లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా సత్యభామ. ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం..

Satyabhama | కాజల్ మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. “సత్యభామ” చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సత్యభామకు స్క్రీన్ ప్లే అందించాడు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు.

గత నవంబర్, డిసెంబర్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుందీ సినిమా. తాజాగా "సత్యభామ" సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. 35 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ 90 శాతం పూర్తయింది.

తాజా షెడ్యూల్ లో కాజల్ పై భారీ యాక్షన్ సీన్స్ తీశారు. ఫైట్ మాస్టర్ సుబ్బు ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించారు. కాజల్ గతంలో ఎప్పుడూ కనిపించని యాక్షన్ మోడ్ లో "సత్యభామ"లో కనిపించబోతోంది. కాజల్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంతో కష్టపడి, ఈ యాక్షన్ సీక్వెన్సులు కంప్లీట్ చేసింది. సినిమాలో ఈ యాక్షన్ సీన్లు ప్రత్యేక ఆకర్షణ అవుతాయని టీమ్ నమ్ముతోంది. "సత్యభామ" బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు.

First Published:  5 Jan 2024 4:44 PM GMT
Next Story