Telugu Global
Cinema & Entertainment

Chiranjeevi: భోళాశంకర్ తో దర్శకేంద్రుడు

K Raghavendra Rao Bolaa Shankar - చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా భోళాశంకర్. ఈ సినిమా సెట్స్ లో దర్శకేంద్రుడు ప్రత్యక్షమయ్యారు.

Chiranjeevi: భోళాశంకర్ తో దర్శకేంద్రుడు
X

మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన కోల్‌కతా సెట్‌లో ఈ సినిమా పాట షూట్ నడుస్తోంది. చిరంజీవి, కీర్తి సురేష్, మరికొందరు నటీనటులు, 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్న ఈ పాట షూటింగ్ భారీ ఎత్తున జరుగుతోంది. ఈ పాటకు కొరియోగ్రఫీని శేఖర్ మాస్టర్ చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

తాజాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సినిమా సెట్‌ని సందర్శించి టీమ్‌తో సరదాగా గడిపారు. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ ‘చూడాలని ఉంది’ లోని సూపర్‌హిట్ పాటను చిత్రీకరించినప్పుడు కోల్‌కతా సెట్‌ను సందర్శించిన జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న భోళా శంకర్ చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని టీంకు బెస్ట్ విశేష్ అందించారు.

మెగాస్టార్ చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు మొదలైన అనేక బ్లాక్‌బస్టర్‌లను రూపొందించిన రాఘవేంద్రరావు.. వాల్తేరు వీరయ్య విజయంపై మెగాస్టార్‌ను అభినందించడానికి భోళా శంకర్ సెట్‌కి వచ్చారు. సెట్‌లో అద్భుతమైన వైబ్స్ చూసిన రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాట రామ్మ చిలకమ్మ లాగా చార్ట్‌బస్టర్ అవుతుందని, భోళా శంకర్ సినిమా ‘చూడాలని ఉంది’ లాంటి బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నారు.




First Published:  12 Feb 2023 7:42 AM GMT
Next Story