Telugu Global
Cinema & Entertainment

Jigarthanda - సూపర్ హిట్ సినిమా సీక్వెల్ వచ్చేస్తోంది

Jigarthanda Double X - జిగత్ తాండా సినిమాకు సీక్వెల్ రెడీ అయింది. దీపావళికి విడుదల కాబోతోంది.

Jigarthanda - సూపర్ హిట్ సినిమా సీక్వెల్ వచ్చేస్తోంది
X

రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న హై యాక్ష‌న్ డ్రామా ‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ దీపావ‌ళికి రిలీజ్ అవుతుంది. దీపావ‌ళికి రాబోతున్న‌ భారీ చిత్రాల్లో డేట్ ఫిక్స్ అయిన మూవీ ఇది. ఈ చిత్రాన్ని మేక‌ర్స్ తమిళ్‌, తెలుగు, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు.

వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని కార్తీకేయ‌న్ నిర్మిస్తున్నారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. అప్ప‌టి నుంచి శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంటోంది. 2014లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన జిగ‌ర్ తండా చిత్రానికి ఇది ప్రీక్వెల్‌. మూవీ అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన రోజు నుంచి ఈ సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి.

‘‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ చిత్రాన్ని ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను భారీ ఎత్తున తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

‘జిగ‌ర్ తండా డ‌బుల్ ఎక్స్‌’ చిత్రానికి కార్తీక్ సుబ్బ‌రాజ్ ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించాడు. స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై కార్తికేయన్ సంతానం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని తమిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేయ‌బోతున్నారు.

First Published:  16 May 2023 11:31 AM GMT
Next Story