Telugu Global
Cinema & Entertainment

Sekhar Kammula: నటీనటుల విషయంలో శేఖర్ కమ్ముల ఎంపిక తప్పవుతుందా?

Sekhar Kammula: సంజయ్ దత్ వంటి పెద్ద స్టార్లను శేఖర్ కమ్ముల హ్యాంగిల్ చేయగలరా లేదా అనేది ఇంకా తెలియదు. పైగా పర భాష ల నుండి స్టార్లను కూడా తీసుకొచ్చి శేఖర్ కమ్ముల తో సినిమా అంటే రిస్క్ అని కొంతమంది చెబుతున్నారు.

Sekhar Kammula
X

శేఖర్ కమ్ముల

చిన్న బడ్జెట్ సినిమా తో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీయడంలో శేఖర్ కమ్ముల దిట్ట అని చెప్పుకోవచ్చు. "లీడర్", "లవ్ స్టోరీ" వంటి హార్డ్ హిట్టింగ్ సినిమాలు మాత్రమే కాక "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" వంటి ఫీల్ గుడ్ సినిమాలు తీయడం కూడా శేఖర్ కమ్ముల కి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఇప్పుడు శేఖర్ కమ్ముల టాలీవుడ్ హీరో ధనుష్ నటిస్తున్న ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ కి ఇది తెలుగులో మొదటి డైరెక్ట్ సినిమా కాబోతోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడిని ఎంపిక చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ బాలీవుడ్ హీరో మరెవరో కాదు సంజయ్ దత్. ఈ మధ్యనే "కేజిఎఫ్: చాప్టర్ 2" సినిమాలో కూడా ముఖ్య విలన్ గా కనిపించిన సంజయ్ దత్ ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా విలన్ పాత్ర కోసం ఎంపిక అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా ఈ సినిమా కోసం సంజయ్ దత్ కు చిత్ర నిర్మాతలు ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ధనుష్ తో ఒక భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాని పెద్ద స్కేల్ లో తీస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ నటీనటుల విషయంలో మాత్రం చిత్ర బృందం వింత ఎంపికలు చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.


సంజయ్ దత్ వంటి పెద్ద స్టార్లను శేఖర్ కమ్ముల హ్యాంగిల్ చేయగలరా లేదా అనేది ఇంకా తెలియదు. పైగా పర భాష ల నుండి స్టార్లను కూడా తీసుకొచ్చి శేఖర్ కమ్ముల తో సినిమా అంటే రిస్క్ అని కొంతమంది చెబుతున్నారు.

ఇక పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనుంది. తెలుగులో మాత్రమే కాక ఈ సినిమా తమిళ్ మరియు హిందీ భాషల్లో కూడా విడుదల కాబోతోంది.

First Published:  13 Dec 2022 2:26 PM GMT
Next Story