Telugu Global
Cinema & Entertainment

Indian 2 | రిపబ్లిక్ డేను స్కిప్ చేసిన భారతీయుడు 2

Indian 2 - రిపబ్లిక్ డేకి ఇండియన్-2 సినిమా నుంచి భారీ అప్ డేట్ ఉంటుందని అంతా ఆశించారు. కానీ అలాంటిదేం జరగలేదు.

Indian 2 | రిపబ్లిక్ డేను స్కిప్ చేసిన భారతీయుడు 2
X

భారతీయుడు 2 కోసం దర్శకుడు శంకర్, కమల్ హాసన్ మరోసారి కలిసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ దశలో చాలా అడ్డంకులు ఎదుర్కొంది. చాలామటుకు అడ్డంకుల్ని అధిగమించి ఈ ఏడాది వేసవికి విడుదలకు సిద్ధమైంది.

అయితే, తమిళ ప్రేక్షకులు, ఇతర సినీ ప్రేమికుల అంచనాలు నిజం కాలేదు, ఎందుకంటే భారతీయుడు 2 విడుదల తేదీని ప్రకటించలేదు. శంకర్ లాంటి పెద్ద దర్శకుడి సినిమాలు ఇలా ప్లానింగ్ లేకుండా రావడం ఆశ్చర్యకరం. అతని వద్ద 3 సినిమాలున్నాయి, ఏడాదిలో ఆ 3 రిలీజ్ చేయాలనేది ప్లాన్. అవి ఇండియన్ 2, గేమ్ ఛేంజర్, ఇండియన్ 3. గేమ్ ఛేంజర్‌ని సెప్టెంబర్‌లో విడుదల చేయాలని, ఇండియన్ 2 వేసవిలో విడుదల చేయాలేది ప్లాన్. కానీ ఇప్పుడు కమల్ సినిమా విడుదల మళ్లీ అనిశ్చితిలో పడినట్టు తెలుస్తోంది.

ఇండియన్ 2 రిలీజ్ డేట్ అప్‌డేట్ రిపబ్లిక్ డే రోజు వస్తుందని అభిమానులు, ప్రేక్షకులు ఆశించారు. కానీ శంకర్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకుండా మళ్లీ నిరాశపరిచాడు. ఇండియన్ 2 సినిమా రిలీజ్ డేట్ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో, ఈ వేసవికి సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు ఎక్కువయ్యాయి.

First Published:  28 Jan 2024 2:44 AM GMT
Next Story