Telugu Global
Cinema & Entertainment

Ileana D'Cruz Health Update: గోవా బ్యూటీ ఇలియానాకు అస్వస్థత

Ileana Health condition: గోవా బ్యూటీ ఇలియానా అనారోగ్యం పాలైంది. హాస్పిటల్ లో జాయిన్ అయింది. అక్కడ్నుంచే కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది.

Ileana DCruz Health Update: గోవా బ్యూటీ ఇలియానాకు అస్వస్థత
X

ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో తన హెల్త్ అప్‌డేట్‌ షేర్ చేసింది. గోవా బ్యూటీకి ఆరోగ్యం బాగోలేదు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో ఉంది.

ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రెండు ఫొటోలు పోస్ట్ చేసింది. "ఒక్క రోజులో ఎంతో తేడా" అంటూ క్యాప్షన్ పెట్టింది. మొదటి చిత్రంలో, ఆసుపత్రి బెడ్‌పై పడుకుని ఉంది. రెండో పిక్ లో ఇలియానా కెమెరాను చూసి నవ్వుతోంది. ఆమె చేతికి సెలైన్ పెట్టడానికి ఉపయోగించే ఐవీ తగిలించి ఉంది.

“నా ఆరోగ్యం పట్ల ఆందోళనతో నాకు సందేశాలు పంపుతున్న ప్రతి ఒక్కరికీ, నా పట్ల మీ శ్రద్ధకు చాలా ధన్యవాదాలు. నేను నిజంగా అదృష్టవంతురాల్ని. నేను ఇప్పుడు పూర్తిగా బాగున్నాను. ఇది నేను మీకు ఇస్తున్న హామీ. సరైన సమయంలో మంచి వైద్య సంరక్షణ లభించింది."

ఇలా తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించింది ఇలియానా. అయితే ఆమెకు ఎదురైన ఆరోగ్య సమస్య ఏంటి? ఒక్కసారిగా ఎందుకు జబ్బుపడింది లాంటి వివరాల్ని ఇలియానా వెల్లడించలేదు.

First Published:  30 Jan 2023 4:49 PM GMT
Next Story