Telugu Global
Cinema & Entertainment

Ileana - వెబ్ సిరీస్ లో గోవా బ్యూటీ

Ileana web series - ఓ వెబ్ సిరీస్ చేస్తోంది ఇలియానా. షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇది గేమ్ ఛేంజర్ అంటోంది ఇలియానా.

Ileana - వెబ్ సిరీస్ లో గోవా బ్యూటీ
X

సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల వెల్లువ కొనసాగుతున్న కాలమిది. పెద్ద తెర కంటెంట్ తో పోలిస్తే ఓటీటీ లో ప్రయోగాలకు ఆస్కారం ఎక్కువ.. పైగా పాత్రల్లో గాఢత పరంగా, ఎంచుకున్న కథలో ఎమోషన్ పరంగా ఓటీటీ కంటెంట్ అద్భుతాలు చేస్తోంది. అంతగా నియమనిబంధనలు వర్తించకపోవడంతో చెలరేగి నటించేందుకు తారలు కూడా ముందుకొస్తున్నారు.

ఇంతకుముందు ఫ్యామిలీ మ్యాన్ సీజన్-1లో ప్రియమణి ప్రయోగాత్మక పాత్రలో నటించి మెప్పించగా.. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత శ్రీలంక టెర్రరిస్టు పాత్రతో మెప్పించింది. నిజానికి ఆ ఇద్దరికీ ఈ వెబ్ సిరీస్ కెరీర్ పరంగా బిగ్ బ్రేకింగ్ ఎలిమెంట్ గా మారింది. సమంత తరహాలోనే రాజ్ అండ్ డీకే తో కలిసి రాశీఖన్నా ప్రయోగాత్మక వెబ్ సిరీస్ ఫర్జీలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

ఇలా అందాల తారలంతా వెబ్ సిరీస్ లతో సత్తా చాటారు... అదే బాటలో ఇప్పుడు ఇలియానా బిగ్ గేమ్ ప్లాన్ తో సిద్ధంగా ఉందని సమాచారం. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న ఇలియానా. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. చిత్రీకరణ కొంచెం పెండింగ్ ఉంది. ఈ ఏడాది చివర్లో ఇది ప్రేక్షకులముందుకు రానుంది. ఇంకా పేరు పెట్టని ఈ వెబ్ సిరీస్, ఇలియానాకు లైఫ్ టైమ్ క్రేజ్ తెచ్చిపెడుతుందని అంటున్నారు నిర్మాత ఆషి దువా.

బీబీసీ స్టూడియోస్ తో కలిసి అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్ ఈ వెబ్ సిరీస్ నిర్మించింది. బర్ఫీ తర్వాత ఇలియానాకు ఆ స్థాయిలో ఈ సిరీస్ పేరు తెచ్చిపెడుతుందంట.

First Published:  12 Jun 2023 10:41 AM GMT
Next Story