Telugu Global
Cinema & Entertainment

SPY Movie - స్పై సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పిన హీరోయిన్

Aishwarya Menon SPY movie - స్పై సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమౌతోంది ఐశ్వర్య మీనన్. ఇంతకీ ఈ ముద్దుగుమ్మకు ఈ అవకాశం ఎలా వచ్చింది.

SPY Movie - స్పై సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పిన హీరోయిన్
X

‘కార్తికేయ 2’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత హీరో నిఖిల్ మరో నేషనల్ థ్రిల్లర్ ‘స్పై'తో వస్తున్నాడు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 29న ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో హీరోయిన్ ఐశ్వర్య మీనన్ మీడియాతో మాట్లాడింది. తనకు తొలి తెలుగు సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందో వివరించింది.

"ఇది నా మొదటి తెలుగు సినిమా. నిజంగా డ్రీమ్ డెబ్యు. దర్శకుడు గ్యారీ బిహెచ్ ఈ సినిమా సైన్ చేసినపుడే నన్ను హీరోయిన్ గా అనుకున్నారు. నేరుగా వచ్చి కథ చెప్పారు. కథ విని చాలా థ్రిల్ అయ్యాను. ఇందులో నాది చాలా ఇంటెన్స్ రోల్. మరో ఆలోచన లేకుండా సైన్ చేశాను. అలా దర్శకుడి సహకారంతో ఈ ప్రాజెక్టులోకి రాగలిగాను."

స్పై సినిమాలో తన పాత్రకు చాలా కోణాలు ఉంటాయంటోంది ఐశ్వర్య మీనన్. రా ఏజెంట్ గా కనిపించడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నానని.. యాక్షన్, గన్ షూటింగ్ లో 6 నెలలు శిక్షణ తీసుకున్నట్టు తెలిపింది.

స్పై సినిమాకి పార్ట్-2 కూడా వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది ఐశ్వర్య. ఒకవేళ సీక్వెల్ వస్తే అందులోనూ తనే హీరోయిన్ గా ఉంటానని చెబుతోంది ఈ బ్యూటీ.

First Published:  26 Jun 2023 12:55 PM GMT
Next Story