Telugu Global
Cinema & Entertainment

కోబ్రా టైటిల్ సీక్రెట్ చెప్పిన విక్రమ్

కోబ్రా మూవీ ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చాడు హీరో విక్రమ్. ఈ సినిమాలో 9 గెటప్స్ వేశాడు ఈ హీరో. ఆ విశేషాలతో పాటు, అసలు కోబ్రా అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వెల్లడించాడు.

కోబ్రా టైటిల్ సీక్రెట్ చెప్పిన విక్రమ్
X

మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది కోబ్రా సినిమా. విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ చాలా డిఫరెంట్ గా ఉంది. మరీ ముఖ్యంగా సినిమాకు కోబ్రా అనే టైటిల్ పెట్టడం కూడా ఆసక్తికరంగా మారింది. ఈ టైటిల్ వెనక సీక్రెట్ ను బయటపెట్టాడు విక్రమ్.

"కోబ్రా ఎప్పుడు కాటేస్తుందో తెలీదు, అలాగే కోబ్రా తన చర్మాన్ని మార్చుకోగలదు. ఇందులో నా పాత్ర అలానే ఉంటుంది. ప్రతి పాత్రలో విభిన్నమైన ఫెర్ఫార్మెన్స్ ఉంటుంది. డబ్బింగ్ లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. నా కెరీర్ లో చాలా సవాల్ గా అనిపించిన సినిమా కోబ్రా."

ఇలా కోబ్రా టైటిల్ వెనక లాజిక్ ను బయటపెట్టాడు విక్రమ్. ఈ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన ఈ విలక్షణ నటుడు, సినిమాలో తను పోషించిన గెటప్స్ పై కూడా స్పందించాడు.

"నిజంగా కోబ్రాలో ఇన్ని పాత్రలు గురించి మొదట ఆలోచన లేదు. ఒక్కసారి చూసుకునే సరికి 9 విభిన్నమైన పాత్రలు వచ్చాయి. కోబ్రా చాలా ఇంటరెస్టింగ్ కథ. గణితం చాలా మందికి కష్టమైన సబ్జెక్ట్. అలాంటి మ్యాథ్స్ ను వాడి ఎలాంటి అడ్వెంచర్స్ చేశారనేది ఇందులో బ్రిలియంట్ గా చెప్పాం. నాకు లెక్కలు సరిగ్గా రావు. కానీ ఇందులో లెక్కల మాస్టారిగా చేశాను."

31వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది కోబ్రా సినిమా. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటించింది.

First Published:  29 Aug 2022 10:58 AM GMT
Next Story