Telugu Global
Cinema & Entertainment

Upendra: ఉపేంద్ర సేఫ్.. సెల్ఫీ వీడియో రిలీజ్

Hero Upendra - తను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు నటుడు ఉపేంద్ర ప్రకటించాడు. తన ఆరోగ్యం బాగాలేదంటూ వచ్చిన పుకార్లను ఖండించాడు.

Upendra: ఉపేంద్ర సేఫ్.. సెల్ఫీ వీడియో రిలీజ్
X

ఉన్నట్టుండి హీరో ఉపేంద్ర టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. దీనికి కారణం అతడి ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు చెలరేగడమే. షూటింగ్ లో ఉపేంద్ర తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, వెంటనే అతడ్ని బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారంటూ నిన్నంతా వరుసపెట్టి కథనాలు వచ్చాయి.

కానీ అవన్నీ పుకార్లు మాత్రమే. ఉపేంద్ర ఆరోగ్యంగానే ఉన్నాడు. స్వయంగా తనే వీడియో రిలీజ్ చేశాడు. తను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఉపేంద్ర సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఓ స్టుడియోలో తను షూటింగ్ లో పాల్గొంటున్నట్టు, తనతో పాటు అందరూ ఉన్నట్టు తెలిపాడు.

నిజానికి ఉపేంద్ర ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిపడిన మాట వాస్తవం. అతడికి డస్ట్ ఎలర్జీ ఉంది. షూటింగ్ స్పాట్ లో ఎక్కువ దుమ్ము ఉండడంతో అతడు ఊపిరి తీసుకోవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. కారవాన్ లో కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత అంతా సెట్ అయిపోయింది. తిరిగి షూట్ లో జాయిన్ అయ్యాడు.

అయితే అంతలోనే అతడు తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడని, హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడంటూ కథనాలు వచ్చేశాయి. దీంతో ఉపేంద్ర స్వయంగా రంగంలోకి దిగి ఆ పుకార్లను ఖండించాడు. ఉపేంద్ర నటించిన కబ్జా సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలకు సిద్ధమైంది.

First Published:  25 Nov 2022 3:17 AM GMT
Next Story