Telugu Global
Cinema & Entertainment

మరో ఐటెంసాంగ్ లో హెబ్బా పటేల్

పొలిటికల్ థ్రిల్లర్ గా వస్తున్న శాసనసభ సినిమాకు మరో ఆకర్షణ వచ్చి చేరింది. ఈ మూవీలో హెబ్బా పటేల్ తో ఓ ఐటెంసాంగ్ పెట్టారు.

మరో ఐటెంసాంగ్ లో హెబ్బా పటేల్
X

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న పాన్‌ఇండియా చిత్రం శాసనసభ. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు.

ఈ చిత్రానికి మరింత మాస్ అప్పీల్ తీసుకొచ్చేందుకు, అందాలతార హెబ్బాపటేల్ తో ఓ ఐటెంసాంగ్ పెట్టారు. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.

పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ ఐటెంసాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు మేకర్స్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న రవి బస్రూర్, ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు.

ఈ స్పెషల్ సాంగ్ కు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించగా.. మంగ్లీ ఆలపించారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.




First Published:  18 Sep 2022 7:11 AM GMT
Next Story