Telugu Global
Cinema & Entertainment

Hari Hara Veeramallu - రెండు భాగాలుగా పవన్ సినిమా?

Hari Hara Veeramallu - పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా వచ్చే అవకాశం ఉంది.

Hari Hara Veeramallu - రెండు భాగాలుగా పవన్ సినిమా?
X

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. సినిమా అయితే సెట్స్ పై ఉంది కానీ ఎప్పటికి పూర్తవుతుందనేది ఎవ్వరూ చెప్పలేరు. అంత స్లోగా సాగుతోంది షూటింగ్. ఇంకా చెప్పాలంటే, ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత పవన్ కల్యాణ్, 2 సినిమాలు పూర్తి చేశాడు.

హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పై ఉంటుండగానే వకీల్ సాబ్, భీమ్లానాయక్ పూర్తి చేశాడు. ఆ రెండూ రిలీజ్ కూడా అయిపోయాయి. ఇంకా ఈ సినిమా సెట్స్ పైనే ఉంది. అంతలోనే వినోదాయశితం అనే రీమేక్ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడు.

ఇలా ఏళ్లుగా సాగుతున్న హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి దర్శకుడు క్రిష్ ఓ ఆలోచన చేశాడు. ఇప్పటికే సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో.. హరిహర వీరమల్లు సినిమాను 2 భాగాలుగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడట.

ఇప్పటివరకు జరిగిన షూటింగ్ పార్ట్ ను క్రోడీకరించి, పార్ట్-1 గా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇది రిలీజ్ అయిన తర్వాత, మెల్లగా పార్ట్-2కు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చనేది ఆలోచన. అయితే క్రిష్ ఆలోచన బాగానే ఉంది కానీ, ఈ ప్రతిపాదనకు పవన్ అంగీకరిస్తాడా అనేది చూడాలి.

First Published:  6 May 2023 3:00 AM GMT
Next Story