Telugu Global
Cinema & Entertainment

Hanuman-Salaar | సూపర్ హిట్ సినిమాలు వచ్చేస్తున్నాయి

Hanuman and Salaar - ఈమధ్య కాలంలో బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమాలు హనుమాన్, సలార్. ఇప్పుడీ రెండు సినిమాలు టీవీల్లోకి రాబోతున్నాయి.

Hanuman-Salaar | సూపర్ హిట్ సినిమాలు వచ్చేస్తున్నాయి
X

థియేటర్లలో సూపర్ హిట్టయిన సినిమాల్ని మరోసారి టీవీల్లో చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. తీరిగ్గా ఇంట్లో కూర్చొని సినిమాను ఆస్వాదించాలనుకునేవాళ్లు చాలామంది. అందుకే థియేటర్లలో హిట్టయిన సినిమాకు టీవీల్లో కూడా మంచి టీఆర్పీలు వస్తుంటాయి.

ఈ క్రమంలో మరో 2 సినిమాలు టీవీల్లోకి రాబోతున్నాయి. అవే సలార్, హనుమాన్. రీసెంట్ టైమ్ లో బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమాలివి. ఆ తర్వాత ఓటీటీలో కూడా హంగామా చేశాయి. ఇప్పుడు బుల్లితెరపై వీరంగం చేయడానికి రెడీ అవుతున్నాయి.

సలార్ సినిమా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది. ఈనెల 21న తొలిసారిగా ప్రసారం చేయబోతోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. టీఆర్పీల్లో రికార్డులు సృష్టిస్తుందని భావిస్తున్నారు.

ఇక 28వ తేదీన హనుమాన్ సినిమా టెలికాస్ట్ కాబోతోంది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్ దక్కించుకుంది. 28న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయబోతోంది. ఈ రెండు సినిమాలతో టీవీ రేటింగ్స్ లో సరికొత్త రికార్డులు మొదలవుతాయని భావిస్తున్నారు.

First Published:  18 April 2024 3:50 PM GMT
Next Story