Telugu Global
Cinema & Entertainment

Hanu-Man | సెన్సార్ పూర్తిచేసుకున్న హను-మాన్

Hanu-Man - తేజ సజ్జ హీరోగా నటించిన సినిమా హను-మాన్. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

Hanu-Man | సెన్సార్ పూర్తిచేసుకున్న హను-మాన్
X

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ భారీ సినిమా, టీజర్, ట్రైలర్ తో జాతీ. స్థాయిలో అందర్నీ ఎట్రాక్ట్ చేసింది.

సంక్రాంతికి విడుదలౌతున్న చిత్రాలలో ఒక క్రేజీ చిత్రంగా వస్తున్న 'హనుమాన్' తాజాగా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. 'హనుమాన్ విజువల్ గా అద్భుతంగా ఉందని, ఎమోషన్స్ బాగున్నాయనే టాక్ బయటకొచ్చింది.

హను-మాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్ గా కనిపించనున్నాడు. సినిమాలో తేజ సజ్జ అక్కగా వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది.

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం ఈ చిత్రానికి సంగీతం అందించారు. హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది.

First Published:  29 Dec 2023 5:06 PM GMT
Next Story