Telugu Global
Cinema & Entertainment

Guntur Kaaram | మహేష్ మూవీ ఎంతవరకు వచ్చింది?

Guntur Kaaram - మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది.

Guntur Kaaram | మహేష్ మూవీ ఎంతవరకు వచ్చింది?
X

గుంటూరు కారం షూటింగ్ షెడ్యూల్ ముగింపు దశకు చేరుకుంది. మహేష్ బాబు నటించిన ఈ చిత్రం జనవరి 12న థియేటర్లలోకి రానుంది, ప్రచార కార్యక్రమాలకు కేవలం 40 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే మేకర్.స్ టీజర్ తో పాటు 'దమ్ మసాలా" అనే పాటను ఆవిష్కరించారు. అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

డిసెంబర్ లోకి వచ్చేశాం. ఈ నెల రోజుల్లో మినిమం గ్యాప్స్ లో 3 పాటలు విడుదల చేయబోతున్నారు. వీటిలో కనీసం ఒక్క సాంగ్ అయినా హిట్టయితే, సినిమాకు మంచి ఊపొస్తుంది. లేదంటే కష్టం.

ప్రస్తుతం సినిమాకు సంబంధించి షూటింగ్ జోరుగా సాగుతోంది. మహేష్-శ్రీలీల మధ్య కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. వచ్చే వారం హీరోహీరోయిన్లపై సెట్ లో ఓ సాంగ్ షూటింగ్ చేయబోతున్నారు. డిసెంబర్ రెండో వారానికి టోటల్ సినిమా పూర్తవుతుంది. చివరివారానికి ఫస్ట్ కాపీ సిద్ధమయ్యే అవకాశం ఉంది. జనవరి మొదటి వారానికే గుంటూరుకారం సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తోంది గుంటూరుకారం సినిమా. అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ నుంచి వస్తున్న సినిమా ఇదే. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  1 Dec 2023 4:41 PM GMT
Next Story