Telugu Global
Cinema & Entertainment

Guntur Kaaram | గుంటూరు కారం అప్ డేట్స్

Guntur Kaaram - మహేష్ హీరోగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీ షూటింగ్ అప్ డేట్స్ చూద్దాం..

Guntur Kaaram | గుంటూరు కారం అప్ డేట్స్
X

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సంక్రాంతికి విడుదల చేయాలనే టార్గెట్ ఫిక్స్ చేసుకున్న యూనిట్, మరో 2 వారాల్లో టోటల్ షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా షూటింగ్ ను పరుగులుపెట్టిస్తోంది.

ప్రస్తుతం సినిమాకు సంబంధించి దమ్ మసాలా సాంగ్ షూటింగ్ నడుస్తోంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ షూట్ నడుస్తోంది. శుక్రవారం వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. రిలీజ్ కు టైమ్ దగ్గరపడుతుండడంతో, వీకెండ్ బ్రేక్ తీసుకోవడం లేదు మహేష్.

ఆదివారం కూడా షూటింగ్ కు రాబోతున్నాడు. ఆది, సోమవారాలు మహేష్, జగపతిబాబు మధ్య కొంత టాకీ తీయబోతున్నారు. దీనికి సారధి స్టుడియోస్ లో ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత మరో వారం రోజుల పాటు శంకరపల్లిలో వేసిన ఇంటి సెట్ లో షూట్ చేస్తారు.

ఈ షెడ్యూల్ తర్వాత 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటాడు మహేష్ బాబు. ఆ తర్వాత శ్రీలీలతో కలిసి సాంగ్ షూట్ లో పాల్గొంటాడు. ఇదొక మెలొడీ సాంగ్. దీని కోసం విదేశాలకు వెళ్లాలా, ఇక్కడే తీయాలా అనేది ఇంకా నిర్ణయించలేదు. వీసా ప్రాసెస్ జరిగితే విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారు.

గంటూరుకారం సినిమాకు సంబంధించి టాకీ దాదాపు పూర్తయింది. ఓ 10శాతం మాత్రమే పెండింగ్ ఉంది. దాంతో పాటు, మరోవైపు సాంగ్స్ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరుకారం సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

First Published:  22 Nov 2023 5:12 PM GMT
Next Story