Telugu Global
Cinema & Entertainment

#Gopichand32 | రేపట్నుంచి గోపీచంద్-శ్రీనువైట్ల సినిమా

#Gopichand32 - శ్రీనువైట్ల దర్శకుడిగా గోపీచంద్ కొత్త సినిమా లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూట్, రేపట్నుంచి పెట్టుకున్నారు.

#Gopichand32 | రేపట్నుంచి గోపీచంద్-శ్రీనువైట్ల సినిమా
X

మాచో స్టార్ గోపీచంద్‌తో దర్శకుడు శ్రీను వైట్ల కొత్త చిత్రం ఇటివలే అనౌన్స్ చేశారు. అదే రోజు ముహూర్తం వేడుక కూడా గ్రాండ్ గా జరిగింది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ మూవీని, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

దర్శకుడు శ్రీను వైట్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు మేకర్స్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమయ్యే సౌత్ ఇటలీలోని మాటెరాలో కొన్ని అద్భుతమైన ప్రదేశాలను దర్శకుడు శ్రీనువైట్ల ఎంపిక చేయడం వీడియోలో చూడవచ్చు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ రేపటి నుండి ప్రారంభమవుతుంది.

సినిమా చాలా భాగం విదేశాల్లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు. కథ ప్రకారం విదేశీ లొకేషన్లు అవసరం అంట. అందుకే ఫస్ట్ షెడ్యూల్ నే అక్కడ ప్లాన్ చేశారు.

శ్రీనువైట్ల తీసిన పలు బ్లాక్‌ బస్టర్స్‌ కు రైటర్ గా పనిచేసిన గోపీ మోహన్, ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. కెవి గుహన్ డీవోపీగా పని చేస్తుండగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

లాంగ్ గ్యాప్ తర్వాత శ్రీనువైట్ల డైరక్షన్ లో వస్తున్న సినిమా ఇది. అతడికి ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. ఇటు గోపీచంద్ కూడా వరుసగా ఫ్లాపులిస్తున్నాడు. సో... ఈ హీరోకు కూడా సక్సెస్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఇద్దరు కలిసి ఎలాంటి సినిమా అందిస్తారో చూడాలి.

First Published:  24 Sep 2023 5:30 PM GMT
Next Story