Telugu Global
Cinema & Entertainment

Gopichand | శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్, సినిమా ప్రారంభం

Gopichand - శ్రీనువైట్ల దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు గోపీచంద్. ఇది యాక్షన్ ఎంటర్ టైనర్ అంట.

Gopichand | శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్, సినిమా ప్రారంభం
X

మాచో స్టార్' గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై కొత్త సినిమా మొదలైంది. మాస్, ఫ్యామిలీస్ ని సమానంగా మెప్పించే యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రాయడంలో, తీయడంలో సిద్ధహస్తుడైన శ్రీను వైట్ల, గోపీచంద్‌ ను ఇంతకు ముందు చేయని పూర్తి భిన్నమైన పాత్రలో చూపించడానికి ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేస్తున్నాడు

గోపీచంద్ కెరీర్ లో ఇది 32వ సినిమా. శ్రీనువైట్లతో కలిసి వర్క్ చేయడం ఈ దర్శకుడికి ఇదే ఫస్ట్ టైమ్. అంతేకాదు, ఈ బ్యానర్ కు కూడా ఇదే తొలి చిత్రం. సినిమాలోని చాలా భాగం విదేశాల్లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు.

భారీ బడ్జెట్‌తో లావిష్ గా రూపొందనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. ముహూర్తం షాట్‌కు మైత్రి నవీన్ కెమెరా స్విచాన్ చేయగా, లెజెండరీ దర్శకుడు కె రాఘవేంద్రరావు క్లాప్‌ కొట్టారు. శ్రీను వైట్ల స్వయంగా తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుంది. శ్రీనువైట్ల తీసిన పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్, ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాస్తున్నాడు. కెవి గుహన్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారు.

First Published:  9 Sep 2023 4:58 PM GMT
Next Story