Telugu Global
Cinema & Entertainment

Gopichand32 | మిలాన్ లో షూటింగ్ మెరుపులు

Gopichand Srinu Vaitla - గోపీచంద్, శ్రీనువైట్ల కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ యూరోప్ దేశాల్లో జరుగుతోంది. తాజాగా ఓ షెడ్యూల్ కంప్లీట్ అయింది.

Gopichand32 | మిలాన్ లో షూటింగ్ మెరుపులు
X

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతోంది. మాస్, ఫ్యామిలీస్ ని సమానంగా మెప్పించే యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను అందించడంలో తనదైన మార్క్ చూపించిన శ్రీను వైట్ల.. తొలిసారి గోపీచంద్‌ తో ఈ సినిమా చేస్తున్నాడు. అతడ్ని పూర్తి భిన్నమైన పాత్రలో ప్రజెంట్ చేస్తున్నాడు.

భారీ బడ్జెట్‌తో లావిష్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి, మిలాన్ షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. ఇటలీ, మిలాన్ లోని కొన్ని అద్భుతమైన లొకేషన్స్ లో హీరో గోపీచంద్ తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నేతృత్వంలో ఓ గ్రాండ్ సాంగ్ ని కూడా ఈ షెడ్యూల్ లో పూర్తి చేశారు. సినిమాలో చాలా భాగం విదేశాల్లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు.

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. శ్రీనువైట్ల తో పలు బ్లాక్‌బస్టర్స్‌ కు పనిచేసిన గోపీమోహన్, ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాశాడు. కెవి గుహన్ కెమెరామెన్ గా పని చేస్తుండగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  14 Oct 2023 8:16 AM GMT
Next Story