Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్‌లోనూ గాడ్ ఫాదర్ సత్తా

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా తెలుగుతోపాటు హిందీలో కూడా విడుదలై అక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. దీంతో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల సంఖ్యను తాజాగా పెంచారు.

బాలీవుడ్‌లోనూ గాడ్ ఫాదర్ సత్తా
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా విడుదలై మంచి కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.69 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి చేసిన గాడ్ ఫాదర్ సూపర్ హిట్ కావడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తెలుగుతోపాటు హిందీలో కూడా విడుదలై అక్కడ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. దీంతో అక్కడ ఈ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల సంఖ్యను తాజాగా పెంచారు.

దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో విడుదల చేశారు. ' గాడ్ ఫాదర్ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. విడుదలైన రెండు రోజుల్లో మా సినిమా రూ. 69 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం పట్ల ఆనందంగా ఉంది. హిందీ బెల్ట్ లో కూడా ఈ సినిమాకు ఆదరణ దక్కుతుండడంతో శనివారం నుంచి అక్కడ 600 స్క్రీన్స్ పెంచుతున్నాం. మా చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా చేసినందుకు ప్రేక్షకులు, అభిమానాలకు ధన్యవాదాలు' అని చిరంజీవి పేర్కొన్నారు.

మలయాళంలో మోహన్ లాల్ హీరోగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా గాడ్ ఫాదర్ తీశారు. ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా నయనతార కీలక పాత్రలో నటించింది. విలన్‌గా యంగ్ హీరో సత్యదేవ్ మెప్పించాడు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఓ క్యామియో రోల్ చేశారు.

First Published:  8 Oct 2022 11:32 AM GMT
Next Story