Telugu Global
Cinema & Entertainment

డేట్ లాక్ చేసిన గాడ్ ఫాదర్

చిరంజీవి హీరోగా నటించిన మూవీ గాడ్ ఫాదర్. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు డేట్ లాక్ అయింది.

డేట్ లాక్ చేసిన గాడ్ ఫాదర్
X

చిరంజీవి హీరోగా నటిస్తున్న మెగా మాస్ మూవీ గాడ్ ఫాదర్. ఈ సినిమా అక్టోబర్ 5న రిలీజ్ అవుతోందని అందరికీ తెలుసు. అనంతపురంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తారని కూడా తెలుసు. అయితే ఆ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడనే అంశంపై చాలామందికి అనుమానాలున్నాయి. ఎట్టకేలకు గాడ్ ఫాదర్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు డేట్ లాక్ చేశారు.

సెప్టెంబరు 28న అనంతపురంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిరంజీవితో పాటు గాడ్ ఫాదర్ టీమ్‌ ఈ మెగా వేడుకకు హాజరుకానున్నారు. పెద్ద సంఖ్యలో వస్తున్న అభిమానులు, సినీ ప్రేక్షకుల సమక్షంలో ఈ వేడుక గ్రాండ్ గా జరగనుంది.

అయితే తేదీ ప్రకటించిన యూనిట్, మరో కీలకమైన అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ ప్రత్యేక అతిథిగా వస్తారనే ప్రచారం వారం రోజులుగా జరుగుతోంది. మరి పవన్ నిజంగానే వస్తారా అనే అంశంపై మాత్రం మేకర్స్ ఇంకా నోరు మెదపడం లేదు.

ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించనున్నారు. సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నాడు. నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన తార్ మార్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

First Published:  25 Sep 2022 10:05 AM GMT
Next Story