Telugu Global
Cinema & Entertainment

Global Box Office | గ్లోబల్ బాక్సాఫీసు కిరీటం తిరిగి హాలీవుడ్ కే!

Global box office revenue 2022 | 2022 లో గ్లోబల్ సినిమా బాక్సాఫీసు ఆదాయం 26 బిలియన్ల డాలర్లకు చేరుకుంది.

Global Box Office | గ్లోబల్ బాక్సాఫీసు కిరీటం తిరిగి హాలీవుడ్ కే!
X

Global Box Office | గ్లోబల్ బాక్సాఫీసు కిరీటం తిరిగి హాలీవుడ్ కే!

Global box office revenue 2022 | 2022 లో గ్లోబల్ సినిమా బాక్సాఫీసు ఆదాయం 26 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. ఇది 2021తో పోలిస్తే ఆరోగ్యకరమైన 27 శాతం పెరుగుదలే గానీ, మహమ్మారికి ముందు స్థాయుల కంటే చాలా తక్కువే. డిసెంబరు 31, 2022 నాటికి పరిశోధనా సంస్థ గోవర్ స్ట్రీట్ అనలిటిక్స్ ప్రపంచ స్థూల బాక్సాఫీసు వసూళ్ళు 25.9 బిలియన్ డాలర్లకి చేరుకున్నాయని లెక్కించింది. 2021 లో ఇది 21.4 బిలియన్లు వుంది. అయితే మహమ్మారి ముందు మూడేళ్ళలో (2017-19) సగటు కంటే 2022 లో 35 శాతం తక్కువగా వుంది. 2022 లో స్థూల వార్షిక రాబడి 14 బిలియన్లని సూచిస్తోందని గోవర్ స్ట్రీట్ అంచనా వేసింది.

2020, 2021 రెండింటిలోనూ అత్యధిక వసూళ్ళు సాధించిన మార్కెట్ గా వున్న చైనా 2022లో బాక్సాఫీసు కిరీటాన్ని అమెరికా (హాలీవుడ్) మార్కెట్‌ కి వదులుకుంది.

అమెరికా మార్కెట్ 2022లో అంచనా వేసిన 7.5 బిలియన్లని పూర్తిగా సాధించింది. అది 2021తో పోలిస్తే 65 శాతం పెరుగుదల, మహమ్మారి పూర్వం 2017-2019 సగటు కంటే 35 శాతం తరుగుదల. చైనా సినిమా వ్యాపారం సుమారుగా 4.33 బిలియన్ల వద్ద ముగిసింది. ఇది 2021 కంటే 36 శాతం తక్కువ. 2022 చైనా బాక్సాఫీసు మహమ్మారి ముందు మూడేళ్ళ సగటుతో పోలిస్తే భారీగా 49 శాతం కోతకి గురైంది. 11 సంవత్సరాల్లో అత్యల్ప వార్షిక ఆదాయం.

అంతర్జాతీయ మార్కెట్ (చైనా, అమెరికా మినహా) 2022లో దాదాపు 14.1 బిలి యన్లు ఆర్జించింది. ఇది 2021తో పోలిస్తే 55 శాతం పురోగతి. మహమ్మారి పూర్వం మూడేళ్ళ సగటుతో పోలిస్తే 29 శాతం పతనం. పోతే, అమెరికా లేదా చైనీస్ మార్కెట్ల కంటే మూడు సంవత్సరాల సగటుతో పోలిస్తే మూడు కీలక మార్కెట్లు మెరుగ్గా పనిచేశాయి.

యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా 7.1 బిలియన్లు సంపాదించాయి. ఇది మహమ్మారి ముందు సగటు కంటే 31 శాతం తక్కువ. 2021 కంటే 52 శాతం ఎక్కువ.

ఆసియా పసిఫిక్ (చైనా మినహా) 2022లో 5.2 బిలియన్లతో 2017-2019 సగటు కంటే 26 శాతం వెనుకబడి వుంది. 2021 నాటితో పోలిస్తే 49 శాతం పెరిగింది. జపాన్ 2022లో స్టార్ మార్కెట్‌గా వుంది. దాని మహమ్మారి ముందు సగటు కంటే కేవలం 9.4 శాతం వెనుకబడి వుంది, 1.5 బిలియన్ల బాక్సాఫీసుతో.

లాటిన్ అమెరికా దాదాపు 1.8 బిలియన్లు స్కోరు చేసింది. ఇది మహమ్మారి ముందు మూడేళ్ళ సగటుకి 30 శాతం తక్కువ. అయితే 2021లో 87 శాతంతో అతి భారీ ఆదాయాన్ని నమోదు చేసింది. ఇక రష్యా సంగతి. మహమ్మారి ముందు వ్యాపార స్థాయులతో పోల్చి చూస్తే, బలహీన మార్కెట్ రష్యా. కేవలం 0.31 బిలియన్లు సాధించింది. యుక్రేన్ యుద్ధంతో రష్యా సినిమా ఆదాయాలు 2021తో పోలిస్తే 43 శాతం పడిపోయాయి. ఇది మహమ్మారికి ముందు స్థాయి కంటే 57 శాతం తక్కువ.

మన దేశం మినహా 2022 లో టాప్ 16 అంతర్జాతీయ మార్కెట్‌లుగా అంచనా వేసిన దేశాలు వరుసగా: చైనా (4.3 బిలియన్), జపాన్ (1.5 బిలియన్), బ్రిటన్- ఐర్లాండ్ (1.2 బిలియన్), ఫ్రాన్స్ (1.1 బిలియన్), దక్షిణ కొరియా (0.9 బిలియన్), జర్మనీ (0.8 బిలియన్), ఆస్ట్రేలియా (0.64 బిలియన్), మెక్సికో (0.63 బిలియన్), స్పెయిన్ (0.4 బిలియన్), బ్రెజిల్ (0.35 బిలియన్), ఇటలీ (0.33 బిలియన్), రష్యా (0.31 బిలియన్) , నెదర్లాండ్స్ (0.27 బిలియన్), సౌదీ అరేబియా (0.25 బిలియన్), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (0.16 బిలియన్). మన దేశపు బాక్సాఫీసు పరిమాణాన్ని ట్రాక్ చేసే యంత్రాంగం గోవర్ స్ట్రీట్ కి లేదు.

(రేపు మరిన్ని ఆసక్తికల్గించే గణాంకాలు)

First Published:  18 July 2023 3:33 PM GMT
Next Story