Telugu Global
Cinema & Entertainment

Bhediya: 'గీతా' నుంచి మరో డబ్బింగ్ మూవీ

మొన్నటికిమొన్న కాంతర సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసిన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇప్పుడు మరో మూవీని విడుదల చేస్తోంది.

Bhediya: గీతా నుంచి మరో డబ్బింగ్ మూవీ
X

గీతా డిస్ట్రిబ్యూషన్ నుంచి ఓ సినిమా వస్తుందంటే అందులో కచ్చితంగా విషయం ఉంటుందనే ఇమేజ్ ఉంది. మొన్నటికిమొన్న కాంతార సినిమా వచ్చింది. అది ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సంస్థ నుంచి మరో డబ్బింగ్ మూవీ రాబోతోంది. దీని పేరు భేదియా.

దినేష్ విజయ్ నిర్మాతగా హారర్-కామెడీ యూనివర్స్‌లో వస్తున్న చిత్రం "భేదియా" ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. హిందీ, తమిళం, తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 25 న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుంది.

ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడిగా భాస్కర్ పాత్రలో హీరో వరుణ్ ధావన్ కనిపించనున్నాడు. డాక్టర్ అనిక పాత్రను కృతి పోషిస్తుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో "గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా "భేదియా" ను తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగులో దీనికి తోడేలు అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

మంచి కంటెంట్ ఉన్న సినిమాల్ని రిలీజ్ చేయడానికి "గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" సంస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ సంస్థ, ఇప్పుడు తోడేలుతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

First Published:  3 Nov 2022 3:43 AM GMT
Next Story