Telugu Global
Cinema & Entertainment

Ponniyan Selvan 2 - అప్పుడే ప్రచారం మొదలు

Ponniyan Selvan 2 - పొన్నియన్ సెల్వన్ 2 సినిమా రెడీ అవుతోంది. ప్రచారం కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలి లిరికల్ వీడియో రాబోతోంది.

Ponniyan Selvan 2 - అప్పుడే ప్రచారం మొదలు
X

మణిరత్నం డైరక్ట్ చేస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే పార్ట్-1 వచ్చింది. పార్ట్-2 ఎప్పుడు రిలీజ్ అవుతుందనే అంశంపై ఇప్పటికీ చాలామందికి చాలా అనుమానాలున్నాయి. ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ, పీఎస్-2 సినిమా విడుదలపై ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ వస్తోంది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.

ఇప్పుడు ఈ సినిమా విడుదలపై మరింత క్లారిటీ వచ్చేసింది. పొన్నియన్ సెల్వన్-2 సినిమా ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా నుంచి తొలి సాంగ్ ను మార్చి 20న రిలీజ్ చేయబోతున్నారు. ఆగనందే అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను రెహ్మాన్ కంపోజ్ చేశాడు.

ఇలా పాటలతో ప్రచారం ప్రారంభించడంతో, పొన్నియన్ సెల్వన్-2 విడుదలపై ఇన్నాళ్లూ ఉన్న అనుమానాలు తొలిగిపోయాయి. ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది పీఎస్2 సినిమా.

మణిరత్నం డైరక్ట్ చేసిన ఈ సినిమాలో విక్రమ్, కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష లాంటి స్టార్ నటీనటులు నటించారు. రెహ్మాన్ లాంటి స్టార్ కంపోజర్ మ్యూజిక్ అందించాడు. అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ కాలేకపోయారు. దీంతో పార్ట్-2పై ఆశలు పెట్టుకుంది లైకా ప్రొడక్షన్స్ సంస్థ.

First Published:  18 March 2023 4:37 AM GMT
Next Story