Telugu Global
Cinema & Entertainment

Family Star | ఆఖరి నిమిషంలో సినిమాకు కత్తెర్లు

Family Star - ఫ్యామిలీ స్టార్ ను మళ్లీ ట్రిమ్ చేశారు. నిడివిని 2 గంటల 30 నిమిషాలకు తీసుకొచ్చారు.

Family Star | ఆఖరి నిమిషంలో సినిమాకు కత్తెర్లు
X

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాలు. ఈ విషయాన్ని స్వయంగా హీరో తన ఇంటర్వ్యూల్లో వెల్లడించాడు. కట్ చేస్తే, ఇప్పుడీ సినిమాకు ఆఖరి నిమిషంలో కత్తెర్లు పడ్డాయి.

ఫ్యామిలీ స్టార్ సినిమా నిడివి ఇప్పుడు 2 గంటల 30 నిమిషాలు మాత్రమే. రీసెంట్ గా మరికొంతమందికి సినిమాను చూపించారు. వీళ్లలో కామన్ ఆడియన్స్ కూడా ఉన్నారు. వాళ్లు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరో 12 నిమిషాలు కట్ చేశారు.

ఇలాంటి విషయాల్లో దిల్ రాజు చాలా చురుగ్గా ఉంటాడనే విషయం తెలిసిందే. ఏమాత్రం అనుమానం వచ్చినా కట్ చేసేస్తాడు. ఫ్యామిలీ స్టార్ విషయంలో కూడా ఇప్పుడిదే జరిగింది. ఒకవేళ సినిమాకు మంచి టాక్ వచ్చి హిట్టయితే, అప్పుడు కట్ చేసిన సీన్లు కలుపుతారు.

"ఫ్యామిలీ స్టార్" సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా పరశురామ్ ఈ సినిమాను రూపొందించాడు. విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. తెలుగు-తమిళ భాషల్లో సినిమా ఒకేసారి రిలీజ్ అవుతోంది.

First Published:  4 April 2024 4:56 PM GMT
Next Story