Telugu Global
Cinema & Entertainment

Family Star | ఈ ఫ్యామిలీ స్టార్ నవ్విస్తాడంట

Family Star - ఫ్యామిలీ స్టార్ ఫుల్లుగా నవ్విస్తాడట. ఆ మేరకు నిర్మాత దిల్ రాజు హామీ ఇస్తున్నాడు.

Family Star | ఈ ఫ్యామిలీ స్టార్ నవ్విస్తాడంట
X

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ మూసాపేటలోని శ్రీరాములు థియేటర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దిల్ రాజు. దర్శకుడు పరశురామ్ పెట్ల పాల్గొన్నారు. ప్రేక్షకుల సందడి మధ్య "ఫ్యామిలీ స్టార్" సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు, సినిమాపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

"ఈ సినిమాలో విజయ్ క్యారెక్టర్ ను క్లాస్, మాస్, యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో పరశురామ్ డిజైన్ చేశాడు. విజయ్ క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుంది. పరశురామ్ సినిమాల్లో లైటర్ వేన్ కామెడీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సినిమాలోనూ అదే తరహాలో నవ్విస్తాడు. సమ్మర్ లో ఫ్యామిలీ స్టార్ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. 21 ఏళ్ల కిందట ఏప్రిల్ 5న దిల్ సినిమాతో నేను నిర్మాతగా దిల్ రాజుగా మారాను. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత అదే రోజున ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అవుతోంది. మిమ్మల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుందీ సినిమా."

"ఫ్యామిలీ స్టార్" సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. పరశురామ్ డైరక్టర్. మృణాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తారు.

First Published:  29 March 2024 2:29 AM GMT
Next Story