Telugu Global
Cinema & Entertainment

Prabhas | సలార్ మళ్లీ వాయిదా పడుతుందా?

Salaar Release Date | ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన సలార్ (Salaar) సినిమా ఇప్పటికే ఓసారి వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా అంటున్నారు కొంతమంది.

Salaar | ప్రభాస్ సినిమా సెన్సార్ రిపోర్ట్
X

Salaar | ప్రభాస్ సినిమా సెన్సార్ రిపోర్ట్

"డంకీ," అభిమానుల మనసులను, ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ మనసులను దోచుకున్న చిత్రం. మరీ ముఖ్యంగా రాజ్ కుమార్ హిరాణి సినిమా ఇది. డిసెంబర్ లో ఈ సినిమా రాబోతోంది. షారూక్ తో పాటు, ఈ చిత్రంలో తాప్సీ, విక్కీ కౌశల్ కూడా నటించారు.

షారూక్ ప్రస్తుతం మంచి ఊపుమీదున్నాడు. పఠాన్, జవాన్ రూపంలో 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఇప్పుడు డంకీతో థియేటర్లలోకి వస్తున్నాడు. ఇలాంటి హీరోతో బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగడం ఎంత వరకు కరెక్ట్? ప్రస్తుతం ఇదే ఆలోచనలో ఉంది సలార్ యూనిట్.

డంకీతో బాక్సాఫీస్ వార్ కు దిగకుండా ఉండేందుకు, ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" ను వాయిదా వేసినట్టు వార్తలొస్తున్నాయి. డిసెంబర్ 22న రావాల్సిన ఈ సినిమాను, వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమనేది ఇంకా తెలియరాలేదు.

"జవాన్", "పఠాన్" వంటి విజయవంతమైన చిత్రాలతో షారూక్ ట్రాక్ రికార్డ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, "డంకీ" బాక్సాఫీస్ వద్ద గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. అదే టైమ్ లో ప్రభాస్ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు. ఆదిపురుష్, రాధేశ్యామ్ ఫ్లాప్ అయ్యాయి. "సలార్" నిజంగా 2024లో వచ్చినట్టయితే, ప్రభాస్ లైనప్ అద్భుతంగా ఉన్నట్టే.

First Published:  6 Nov 2023 4:48 PM GMT
Next Story