Telugu Global
Cinema & Entertainment

Double Ismart | రామ్ మూవీ షూటింగ్ అప్ డేట్స్

Double Ismart - రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ మూవీ అప్ డేట్స్ చెక్ చేద్దాం..

Double Ismart | రామ్ మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కలిసి చేస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్‌. బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కొద్ది రోజుల క్రితం ముంబైలో మొదలైంది. తాజాగా ఆ షెడ్యూల్ పూర్తయింది. ఫస్ట్ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు.

తాజాగా ఈ చిత్రం రెండో షెడ్యూల్ థాయిలాండ్ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో హీరో రామ్, సంజయ్ దత్ పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈసారి కొంత యాక్షన్ తో పాటు, టాకీ పార్ట్ పూర్తి చేయబోతున్నారు.

ఇటీవలే విడుదలైన సంజయ్ దత్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'డబుల్ ఇస్మార్ట్‌' లో సంజయ్ దత్‌ను మునుపెన్నడూ చూడని స్టయిలిష్ అవతార్‌లో చూపించనున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్. రామ్, సంజయ్ దత్‌లను తెరపై కలిసి చూడటం అభిమానులకు, సినీ ప్రియులకు ఎక్సయిటింగ్ గా ఉంటుందని చెబుతున్నాడు.

ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సాంకేతికంగా హై-లెవెల్లో ఉంటుందంట. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తారు.

డబుల్ ఇస్మార్ట్ ను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదల చేయబోతున్నారు.

First Published:  13 Aug 2023 2:54 PM GMT
Next Story