Telugu Global
Cinema & Entertainment

Disha Patani - ప్రాజెక్ట్-కె నుంచి మరో అప్ డేట్

Disha Patani - ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ప్రాజెక్ట్-కె. ఇందులో దిశా పటానీ కూడా నటిస్తోంది. ఆమె ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు.

Disha Patani - ప్రాజెక్ట్-కె నుంచి మరో అప్ డేట్
X

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఇది కూడా ఒకటి. ఓవైపు షూటింగ్ నడుస్తుంటే, మరోవైపు ప్రచారం కూడా ప్రారంభించింది యూనిట్. ఫ్రమ్ ది స్క్రాచ్ ట్యాగ్ లైన్ తో ప్రీ-ప్రొడక్షన్ పనులను వీడియోల రూపంలో విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా నటీనటుల పుట్టినరోజుల కోసం ప్రీ-లుక్ పోస్టర్‌లను కూడా రివీల్ చేస్తున్నారు.

ఇదివరకే ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ ప్రీ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. నిన్న పుట్టినరోజు జరుపుకున్న నటి దిశా పటానీ ప్రీ లుక్ పోస్టర్‌ ని ఈరోజు మేకర్స్ విడుదల చేశారు.

ప్రీలుక్ పోస్టర్ లో దిశా పటాని పెళ్లి కూతురు గెటప్‌లో నుదిటిపై పెళ్లి బొట్లుతో కనిపిస్తుంది. పోస్టర్‌ లో ఆమె పదునైన కళ్ళు చూడవచ్చు.

దర్శకుడు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్‌ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రపంచస్థాయి నిర్మాణ ప్రమాణాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టెక్నికల్‌ గా ఈ సినిమా మరో స్థాయిలో ఉండబోతోంది.

50 మెమరబుల్స్ ఇయర్స్ జరుపుకుంటున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అశ్విని దత్ నిర్మాత.

ప్రాజెక్ట్ K జనవరి 12, 2024న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

First Published:  14 Jun 2023 4:37 PM GMT
Next Story