Telugu Global
Cinema & Entertainment

Family Star | టార్గెట్ రీచ్ అయ్యానంటున్న దిల్ రాజు

Family Star - ఫ్యామిలీ స్టార్ సినిమాతో తను అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యానంటున్నారు దిల్ రాజు.

Family Star | టార్గెట్ రీచ్ అయ్యానంటున్న దిల్ రాజు
X

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వచ్చింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారని అంటున్నాడు నిర్మాత దిల్ రాజు. రిలీజైన ప్రతి థియేటర్ లో హౌస్ ఫుల్స్ తో ఫ్యామిలీ స్టార్ రన్ అవుతోందని.. ఈ సినిమాతో తమ టార్గెట్ రీచ్ అయ్యామని చెబుతున్నాడు.

"ఫ్యామిలీ స్టార్ సినిమా మేం టార్గెట్ చేసిన ఫ్యామిలీ ఆడియెన్స్ కు రీచ్ అయింది. ఫ్యామిలీ ఆడియెన్స్ క్రౌడ్స్ గా థియేటర్స్ కు వెళ్తున్నారు. మీడియా నుంచి వచ్చిన రివ్యూస్ ఒకలా ఉన్నాయి. సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ వేరుగా ఉంది. వాళ్లలో 90 పర్సెంట్ మందికి ఫ్యామిలీ స్టార్ బాగా నచ్చింది. మేము ఇచ్చే స్టేట్ మెంట్స్ ను మీడియా ఎలా యాక్సెప్ట్ చేస్తుందో వాళ్లు రివ్యూస్ లో ఇచ్చే స్టేట్ మెంట్స్ ను మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా చూడండి. మాకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చిందో మీరూ అలాగే ఫీలవుతారు."

ఇలా తన ఫ్యామిలీ స్టార్ హిట్టయిందని పరోక్షంగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు దిల్ రాజు. విజయ్ దేవరకొండ, మృణాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మొదటి రోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది. సినిమా సాగదీసినట్టు ఉందనే విమర్శ కామన్ గా వినిపించింది. యూనిట్ మాత్రం సూపర్ హిట్ అంటోంది.

First Published:  6 April 2024 9:36 AM GMT
Next Story