Telugu Global
Cinema & Entertainment

Chiyan Vikram | విక్రమ్ సినిమా వచ్చేస్తోందోచ్!

Dhruva Nakshathram - విక్రమ్ నుంచి ఈసారి యాక్షన్ మూవీ రాబోతోంది. ఈనెల్లోనే ధృవ నక్షత్రం రిలీజ్ కానుంది.

Chiyan Vikram | విక్రమ్ సినిమా వచ్చేస్తోందోచ్!
X

వర్సెటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ "ధృవ నక్షత్రం". రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించాడు. విక్రమ్-గౌతమ్ మీనన్ కాంబోలో ఇదే తొలి సినిమా కావడం విశేషం.

ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్, ఒరువూరిలియోరు ఫిల్మ్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరపైకి రానుంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కు "ధృవనక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధ కాండం" అనే పేరు పెట్టారు. ఈ నెల 24న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది పార్ట్-1.

"ధృవనక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధ కాండం" నుంచి 'కరిచే కళ్లే..' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. హ్యారిస్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ రాయగా.. శ్రీలేఖ పార్థసారధి పాడారు. హీరోయిన్ తన ప్రేమ భావాల్ని వ్యక్తం చేసే సందర్భంలో ఈ పాట వస్తుంది.

విక్రమ్ నటించిన 2 సినిమాలు ఒకేసారి రెడీ అయిన సంగతి తెలిసిందే. ధృవనక్షత్రంతో పాటు.. తంగలాన్ కూడా రెడీ అయింది. వీటిలో ధృవనక్షత్రం పార్ట్-1 ఈనెలాఖరుకు వస్తోంది. తంగలాన్ జనవరి 26న వస్తుంది. మార్చిలో ధృవనక్షత్రం పార్ట్-2 రిలీజ్ అవుతుంది.

First Published:  5 Nov 2023 1:42 PM GMT
Next Story