Telugu Global
Cinema & Entertainment

Viswambhara | మేకోవర్ అవుతున్న మెగాస్టార్

Viswambhara Movie - చిరంజీవి అప్ కమింగ్ మూవీ విశ్వంభర. ఈ సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు మెగాస్టార్.

Viswambhara | మేకోవర్ అవుతున్న మెగాస్టార్
X

మెగాస్టార్ చిరంజీవి మెగా ఫాంటసీ ఆడ్వెంచర్ 'విశ్వంభర'. ఇప్పటికే విడుదలైన వీడియో సినిమాపై అంచనాలు పెంచింది. ఇప్పుడీ సినిమా కోసం చిరంజీవి జిమ్ లో కసరత్తులు మొదలుపెట్టారు. మేకోవర్ లో ఇది ఓ భాగం మాత్రమే.

దీనికి సంబధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ లో వైరల్ అవుతోంది. వీడియో చివర్లో ''గెట్టింగ్ రెడీ ఫర్ విశ్వంభర' అని మెగాస్టార్ చెప్పడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ నెల నుంచి 'విశ్వంభర' షూటింగ్ లో జాయిన్ అవుతున్నారు మెగాస్టార్ చింజీవి.

బింబిసార ఫేమ్ వశిష్ట ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తునారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్‌ కామిరెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్లిరిక్ రైటర్స్. 2025 సంక్రాంతికి విశ్వంభర థియేటర్లలోకి వస్తోంది.

First Published:  1 Feb 2024 5:05 PM GMT
Next Story