Telugu Global
Cinema & Entertainment

Bholaa Shankar - డబ్బింగ్ పూర్తి చేసిన మెగాస్టార్

Bholaa Shankar - భోళాశంకర్ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులు పూర్తిచేశారు చిరంజీవి. ఫొటోలు కూడా షేర్ చేశారు.

Bholaa Shankar - డబ్బింగ్ పూర్తి చేసిన మెగాస్టార్
X

చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ' భోళా శంకర్'. టీజర్‌లో తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్‌ లో కనిపించి అందరినీ అలరించారు మెగాస్టార్. ఇటివలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మెగా స్టార్ చిరంజీవి 'భోళా శంకర్' డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియో నుంచి ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు.

''సినిమా రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫైర్ మాస్ ఎంటర్‌టైనర్ ఖచ్చితంగా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది! మీ క్యాలెండర్‌ లను మార్క్ చేసుకోండి! థియేటర్స్ లో కలుద్దాం! # భోళాశంకర్ ఆగస్టు 11'' అని ట్వీట్ చేశారు మెగాస్టార్.

ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలోని ఫస్ట్ సింగిల్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌ గా నిలిచింది. మిగిలిన పాటలు ఒకదాని తర్వాత ఒకటి విడుదలౌతాయి. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. చిరు చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తోంది. భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

First Published:  6 July 2023 1:43 PM GMT
Next Story