Telugu Global
Cinema & Entertainment

చిరు Vs బాలయ్య... పోటీ తప్పేలా లేదు!

ఈసారి సంక్రాంతికి పోటీ రసవత్తరంగా మారేలా ఉంది. ఏకంగా చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు పోటీకి సై అంటున్నాయి

చిరు Vs బాలయ్య... పోటీ తప్పేలా లేదు!
X

చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు బాక్సాఫీస్ బరిలో పోటీపడడం కొత్తేంకాదు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ఇద్దరు బడా హీరోలు, కొన్ని సందర్భాల్లో ఒకేరోజు తమ సినిమాల్ని రిలీజ్ చేసి ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓసారి బాలయ్య విజేతగా నిలిస్తే, ఇంకోసారి చిరంజీవి పైచేయి సాధించారు.

ఇప్పుడు మరోసారి అలాంటి సందర్భం రానే వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. బాలయ్య, చిరంజీవి కొత్త సినిమాలు సంక్రాంతి బరిలో పోటాపోటీగా నిలిచే అవకాశం ఉందంటున్నారు చాలామంది. అయితే ఈసారి ఓ విశేషం ఉంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. అటు బాబి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ రెండు సినిమాల్ని ఒకే నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. అదే మైత్రీ మూవీ మేకర్స్.

ఇలా ఒకే ప్రొడక్షన్ నుంచి రెండు పెద్ద సినిమాలు, ఒకే తేదీకి వచ్చి పోటీపడడం అనేది టాలీవుడ్ చరిత్రలో ఇప్పటివరకు జరగలేదు. ఒకవేళ అదే కనుక జరిగితే సదరు నిర్మాణ సంస్థకు నష్టాలు తప్పవు.

ప్రస్తుతానికైతే ఈ రెండు సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వస్తాయని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. అయితే ప్రొడ్యూసర్ల వైపు నుంచి మాత్రం ఈ క్లాష్ పై ఎలాంటి క్లారిటీ లేదు.

First Published:  19 Oct 2022 4:30 AM GMT
Next Story