Telugu Global
Cinema & Entertainment

Businessman Re-Release | మహేష్ నుంచి మరో సినిమా రీ-రిలీజ్

Businessman Movie Re-Release | మహేష్-పూరి కాంబోలో వచ్చిన సినిమా బిజినెస్ మేన్. ఈ మూవీ ఇప్పుడు మరోసారి థియేటర్లలోకి వస్తోంది.

Businessman Re-Release | మహేష్ నుంచి మరో సినిమా రీ-రిలీజ్
X

Businessman Re-Release | మహేష్ నుంచి మరో సినిమా రీ-రిలీజ్

రీ-రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ చేసిందే మహేష్ బాబు. అతడు నటించిన పోకిరి సినిమాను ఆమధ్య రీ-రిలీజ్ చేశారు. దానికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అప్పట్నుంచి మిగతా హీరోల సినిమాలు కూడా రీ-రిలీజ్ అవ్వడం మొదలయ్యాయి. ప్రస్తుతం ఇది ఓ ఉద్యమంలా సాగుతోంది. కనీసం నెలకు 2 పాత సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి.

ఇప్పుడు మహేష్ బాబు సినిమానే ఇంకోటి విడుదలకు సిద్ధమైంది. అదే బిజినెస్ మేన్. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు సృష్టించకపోయినా, ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంది. ఇందులో మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ ఒక్కొక్కటి తూటాల్లా పేలాయి. ఇప్పటికీ ఈ సినిమాలో డైలాగ్స్ పాపులరే.

ఆగస్ట్ 9న బిజినెస్ మేన్ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నారు. దీన్ని కూడా 4K రిజల్యూషన్ లోకి మార్చారు. నిజానికి ఈ సినిమాను రీ-మాస్టరింగ్ చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఇప్పుడున్న టెక్నాలజీకి సినిమాను అప్ గ్రేడ్ చేశారు.

మహేష్-కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అత్యంత వేగంగా పూర్తిచేశాడు దిల్ రాజు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో కేవలం 46 రోజుల్లో సినిమాను పూర్తిచేశాడు. పెద్ద హీరోల్లో ఇంత తొందరగా ఓ సినిమాను కంప్లీట్ చేసిన హీరో వేరే ఎవ్వరూ లేరు. బిజినెస్ మేన్ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. సారొస్తారా అనే పాట సూపర్ హిట్.

First Published:  30 July 2023 5:45 PM GMT
Next Story