Telugu Global
Cinema & Entertainment

Allu Arjun - Boyapati | బన్నీ-బోయపాటి కాంబో రిపీట్?

Boyapati - Allu Arjun - అప్పుడెప్పుడో సరైనోడు సినిమా వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు బన్నీ-బోయపాటి కాంబోలో సినిమా రాబోతోంది.

Allu Arjun - Boyapati | బన్నీ-బోయపాటి కాంబో రిపీట్?
X

బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కోసం ఓ కథ రాస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి గతంలో సరైనోడు సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అప్పట్నుంచి మళ్లీ బోయపాటి కాంబినేషన్‌లో సినిమా రావాలని బన్నీ అభిమానులు కోరుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను, ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాపైనే వర్క్ చేస్తున్నాడు.

బోయపాటి-రామ్ కాంబోలో వచ్చిన స్కంద సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ సినిమా ప్రచారంలోనే బన్నీతో సినిమాపై స్పందించాడు బోయపాటి. సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు. అయితే బన్నీ, బోయపాటికి ఛాన్స్ ఇస్తాడా అనేది డౌట్. అల్లు అర్జున్ అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా యూనివర్సల్ ఆడియన్స్ కోసం సినిమాలు చేయాలనుకుంటున్నాడు. పైగా పాన్ ఇండియా డైరక్టర్ల కోసం చూస్తున్నాడు.

అట్లీ, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుల్ని లైన్లో పెట్టాడు. త్రివిక్రమ్ లిస్ట్ లో ఉండనే ఉన్నాడు. ఇలాంటి టైమ్ లో స్కందతో ఫ్లాప్ ఇచ్చిన బోయపాటికి బన్నీ చాన్స్ ఇస్తాడా అనేది చూడాలి.

అయితే తాజాగా నిర్మాత బన్నీ వాస్ చేసిన వ్యాఖ్యలు సరైనోడు కాంబినేషన్ రిపీట్ కావచ్చని సూచించింది. బన్నీ-త్రివిక్రమ్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దాదాపు ఏడాది పడుతుందట. కాబట్టి సినిమా షూటింగ్ 2025 మధ్యలో మాత్రమే ప్రారంభమవుతుంది. ఈ కారణంగా, అల్లు అర్జున్ పుష్ప 2, త్రివిక్రమ్ చిత్రానికి మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించడానికి, బోయపాటికి ఛాన్స్ ఇవ్వొచ్చని అంటున్నాడు.

First Published:  24 Nov 2023 5:07 PM GMT
Next Story