Telugu Global
Cinema & Entertainment

Rajinikanth - సూపర్ స్టార్ ను డైరక్ట్ చేయబోతున్న బాబి

Bobby to direct Rajinikanth - సూపర్ స్టార్ రజనీకాంత్ ను డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు దర్శకుడు బాబి. అన్నీ అనుకున్నట్టు జరిగితే దిల్ రాజు దీనికి నిర్మాత.

Rajinikanth - సూపర్ స్టార్ ను డైరక్ట్ చేయబోతున్న బాబి
X

దర్శకుడు బాబి, మరో భారీ అవకాశం దక్కించుకున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో తన టాలెంట్ చూపించిన ఈ దర్శకుడు, త్వరలోనే రజనీకాంత్ ను డైరక్ట్ చేయబోతున్నాడు. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే బాబి దర్శకత్వంలో రజనీకాంత్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది. దీనికి దిల్ రాజు నిర్మాత.

విజయ్ తో వారసుడు సినిమా చేసిన తర్వాత రజనీకాంత్ పై కన్నేశాడు దిల్ రాజు. ఎలాగైనా ఆయనతో సినిమా చేయాలనేది అతడి ప్లాన్. అందుకు తగ్గట్టు వంశీ పైడిపల్లి లాంటి దర్శకుడ్ని లైన్లో పెట్టాడు. కానీ ఆ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. అంతలోనే బింబిసార దర్శకుడు వశిష్ట పేరు కూడా తెరపైకొచ్చింది. ఇవన్నీ వార్తల్లో నలుగుతుండగానే, బాబి సినిమా లాక్ అయినట్టు బ్రేకింగ్ వచ్చేసింది.

ప్రస్తుతం జైలర్ సినిమా చేస్తున్నారు రజనీకాంత్. ఆ తర్వాత కూతురు దర్శకత్వంలో వస్తున్న లాల్ సలామ్ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన వెంటనే బాబి సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తలపెట్టాడు దిల్ రాజు. ఆ సినిమాతో పాటు, రజనీకాంత్ సినిమాను సైమల్టేనియస్ గా స్టార్ట్ చేయాలనేది ఈ బడా ప్రొడ్యూసర్ ఆలోచన.

First Published:  13 April 2023 12:50 PM GMT
Next Story