Telugu Global
Cinema & Entertainment

Peddha Kapu | టైటిల్ వెనక స్టోరీ బయటపెట్టిన దర్శకుడు

Peddha Kapu Title - ఈ టైటిల్ వెనక స్టోరీని బయటపెట్టాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.

Peddha Kapu | టైటిల్ వెనక స్టోరీ బయటపెట్టిన దర్శకుడు
X

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది పెదకాపు సినిమా. ఈ సినిమా టైటిల్ పై చాలామందికి ఇంకా అపోహలు, అనుమానాలున్నాయి. వీటిని ఇప్పటికే నివృత్తి చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. రిలీజ్ కు ఇంకా కొన్ని గంటలు మాత్రమే టైమ్ ఉన్న నేపథ్యంలో, టైటిల్ పై మరోసారి స్పందించాడు.

"నిజానికి ఇందులో కమ్యూనిటీ ప్రస్తావన ఉండదండీ. మొదట ఈ సినిమాకి కర్ణ అనే పేరు అనుకున్నాం. ఒకసారి గొల్లలమామిడాడ అనే ఊరికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి పేరు బస్టాండ్ లో ఫ్లెక్సీపై చూశాను. అతడి పేరుకి బ్రాకెట్ లో పెదకాపు అని ఉంది. అదేంటని అడిగితే పది మందిని కాపాడి, పదిమందికి సాయం చేసేవాడు పెదకాపు అని చెప్పారు. నేను చెప్పదలచుకున్న కథ కూడా అదే కదా, ఈ పేరు పెడదామని నిర్మాతకు చెప్పాను. బావుంది ఇదే పేరు పెడదామన్నారు. అలా పెదకాపు పేరు ఖరారు చేశాం."

ఇలా పెదకాపు టైటిల్ పై మరోసారి స్పష్టత ఇచ్చాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాను డైరక్ట్ చేయడంతో పాటు, దీనికి కథ కూడా ఇతడే రాసుకున్నాడు. అంతేకాదు, సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర కూడా పోషించాడు. అందుకే అడ్డాలకు ఇది ప్రతిష్టాత్మక సినిమాగా మారింది.

రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఈరోజు కొన్ని సెంటర్లలో పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో కొద్దిసేపటి కిందట ప్రత్యేక షో వేశారు. దీనికి దర్శకుడు, హీరో హాజరయ్యారు. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందంటున్నాడు అడ్డాల శ్రీకాంత్.




First Published:  28 Sep 2023 5:10 PM GMT
Next Story