Telugu Global
Cinema & Entertainment

Ram Charan | రామ్ చరణ్ కోసం సముద్ర తీరం సెట్

Ram Charan | త్వరలోనే బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. ఈ మూవీ కోసం బీచ్ సెట్ వేయబోతున్నారు.

Ram Charan | రామ్ చరణ్ కోసం సముద్ర తీరం సెట్
X

Ram Charan | రామ్ చరణ్ కోసం సముద్ర తీరం సెట్

రామ్ చరణ్ ప్రస్తుతం పీరియాడికల్ మూవీస్ పై మనసు పారేసుకున్నట్టున్నాడు. అతడు నటించిన RRR మూవీ పూర్తిగా పీరియాడిక్ సినిమా. ఇక శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ ఛేంజర్ లో కూడా పీరియాడిక్ ఛాయలున్నాంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రామ్ చరణ్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్న సినిమా కూడా పీరియాడిక్ డ్రామానే అని తెలుస్తోంది.

బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు రామ్ చరణ్. ఇది బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ డ్రామాగా అని తెలుస్తోంది. దీనికి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ యాడ్ చేశారంట. ఇంకా చెప్పాలంటే, అమీర్ ఖాన్ లగాన్ టైపు సినిమా అంటున్నారు.

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం సముద్రతీర పట్టణం నేపథ్యంలో సాగుతుంది. వైజాగ్, తూర్పుగోదావరి జిల్లాల్లోని తీరప్రాంతంలో జరిగే పీరియాడిక్ కథగా ఈ సినిమా రాబోతోంది. సినిమాలో రామ్ చరణ్ కూడా అదే యాసలో మాట్లాడనున్నాడు.

దర్శకుడు బుచ్చిబాబు బలమైన, ఎమోషనల్‌ కథను రాసుకున్నట్లు సమాచారం. రామ్ చరణ్ టైట్ స్క్రిప్ట్ చూసి ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో సముద్రతీరం సెట్ వేయబోతున్నారు. గతంలో తను తీసిన ఉప్పెన సినిమా కోసం కూడా బుచ్చిబాబు ఇలానే అన్నపూర్ణ స్టూడియోలో సముద్రం సెట్ వేశాడు. ఇప్పుడు రామ్ చరణ్ మూవీకి కూడా అదే పద్ధతి ఫాలో అవ్వబోతున్నాడు.

ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నాడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ గ్యాప్ లో గేమ్ ఛేంజర్ షూట్ పూర్తిచేయబోతున్నాడు చరణ్.

First Published:  21 July 2023 11:16 AM GMT
Next Story