Telugu Global
Cinema & Entertainment

Banita Sandhu | గూఢచారి2లో బాలీవుడ్ బ్యూటీ

Banita Sandhu | తెలుగుతెరపైకి మరో బాలీవుడ్ బ్యూటీ బనితా సంధు అడుగు పెడుతోంది

గూఢచారి ‘G2’ లో అడివి శేష్‌ కు జోడిగా బనితా సంధు
X

బనితా సంధు

Banita Sandhu | అడివి శేష్ అప్ కమింగ్ మూవీ జీ2 (గూఢచారి 2) కోసం అభిమానులను చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ ఈ సినిమా పై అంచనాలు పెంచింది. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ని అనౌన్స్ చేశారు. గూఢచారి ‘G2’ లో అడివి శేష్‌ కు జోడిగా బనితా సంధు నటిస్తోందని మేకర్స్ తెలియజేశారు.

మేజర్, కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి సినిమాలు నిర్మించిన పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ నుంచి వస్తోంది జీ2. ఇదొక యాక్షన్ స్పై థ్రిల్లర్. ఇలాంటి ప్రతిభావంతులైన నటీనటులు స్టార్ కాస్ట్ లో చేరడంతో చిత్రం బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ అవుతుందని హామీ ఇచ్చింది.

అక్టోబర్, సర్దార్‌ ఉదమ్‌ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది బనిత. ఆమె ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్, పంజాబీ సినిమాల్లో బిజీగా ఉంది. గుఢచారి-2తో ఆమె తన టాలీవుడ్ జర్నీ ప్రారంభించింది. అంతేకాదు, కెరీర్ లో బనితకు ఇది తొలి పాన్ ఇండియా మూవీ.

ఇప్పటివరకు బనితను చూడని కొత్త లుక్, గెటప్ లో గూఢచారి2లో చూడబోతున్నారు ప్రేక్షకులు. ఇంతకుముందు గూఢచారి సినిమాలో నటించిన శోభిత ధూళిపాళ్ల లానే కనిపిస్తోంది బనిత కూడా.

వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

First Published:  21 Nov 2023 4:38 PM GMT
Next Story