Telugu Global
Cinema & Entertainment

Upasana - మెగా కోడలికి వరుసపెట్టి సీమంతాలు

Upasana Baby showers - ముచ్చటగా మూడోసారి సీమంతం చేసుకుంది ఉపాసన కొణెదల. తాజాగా ఆ స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు.

Upasana - మెగా కోడలికి వరుసపెట్టి సీమంతాలు
X

స్టార్ కపుల్ రామ్‌చరణ్‌, ఉపాసన కామినేని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్. దుబాయ్ లో ఆమెకు సీమంతం నిర్వహించారు. ఆ ఫొటోలు అప్పట్లో వైరల్‌ అయ్యాయి. ఆ తర్వాత హైదరాబాద్‌లో మరో రెండు సీమంతం వేడుకలు వైభవంగా జరిగాయి.

ఈ పార్టీలకు అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు హాజరయ్యారు. పింకీ రెడ్డి, సానియా మీర్జా, కనికా కపూర్‌, అల్లు అర్జున్‌తో పాటు వారి కుటుంబసభ్యులు కూడా ఈ వేడుకలో అలరించారు. అలాగే కుటుంబసభ్యులు చిరంజీవి కొణిదెల, సురేఖ, సుష్మిత, శ్రీజతో పాటు ఉపాస‌న త‌ల్లి శోభన కామినేని, సంగీతారెడ్డి కూడా ఈ వేడుకలో ఆనందంగా పాల్గొన్నారు.

ప్రస్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో తెగ‌ వైర‌ల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా బన్నీ ఉన్న ఫొటోల్ని అల్లు అర్జున్ ఆర్మీ తెగ వైరల్ చేస్తోంది. ఈ ఫొటోలతో చరణ్-బన్నీ మధ్య సయోధ్య కుదిరిందంటున్నారు చాలామంది.

బన్నీ-చరణ్ మధ్య సరిగ్గా పొసగడం లేదంటూ ఈమధ్యకాలంలో చాలా కథనాలొచ్చాయి. వాటికి చెక్ పెడుతూ, ఉపాసన సీమంతానికి సకుటుంబ సపరివార సమేతంగా హాజరయ్యాడు బన్నీ. ఆ తర్వాత ఉపాసనతో దిగిన ఫొటోను ఇనస్టాగ్రామ్ లో కూడా షేర్ చేశాడు.




First Published:  24 April 2023 4:45 PM GMT
Next Story