Telugu Global
Cinema & Entertainment

Anu Emmanuel | జపాన్ చేతిలో హీరోయిన్ ఫ్యూచర్

Anu Emmanuel - జపాన్ మూవీలో కార్తి సరసన హీరోయిన్ గా నటించింది అను ఎమ్మాన్యుయేల్. వరుసగా ఫ్లాపులు చూస్తున్న ఈ ముద్దుగుమ్మ జపాన్ పై ఆశలు పెట్టుకుంది.

Anu Emmanuel | జపాన్ చేతిలో హీరోయిన్ ఫ్యూచర్
X

Anu Emmanuel | జపాన్ చేతిలో హీరోయిన్ ఫ్యూచర్

అను ఎమ్మాన్యుయేల్.. అందమంటే ఇలా ఉండాలి అన్నట్టుంటుంది. తన గ్లామర్ తో సౌత్ ఆడియన్స్ ను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే దేవుడు ఆమెకు అందమైతే ఇచ్చాడు కానీ, అదృష్టం మాత్రం ఇవ్వలేదనిపిస్తోంది. కెరీర్ స్టార్ట్ చేసి ఇన్నేళ్లయినా, అను ఎమ్మాన్యుయేల్ ఇంకా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా హిట్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది.

తెలుగులో మజ్ను సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది అను ఎమ్మాన్యుయేల్. ఆ తర్వాత వరుసపెట్టి గోపీచంద్, పవన్ కల్యాణ్, నాగచైతన్య, శర్వానంద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ లాంటి హీరోల సినిమాల్లో నటించింది. కానీ ఏ ఒక్క సినిమా ఆమెకు కలిసిరాలేదు. కెరీర్ లో ఆమెకు హిట్స్ కంటే, ఫ్లాపులే ఎక్కువయ్యాయి.

రీసెంట్ గా రవితేజ సరసన ఆమె చేసిన రావణాసుర సినిమా కూడా డిజాస్టర్ అయింది. అటు తమిళనాట విశాల్ లాంటి హీరోలు ఒకరిద్దరు సక్సెస్ ఇచ్చినప్పటికీ, దాన్ని ఈమె క్యాష్ చేసుకోలేకపోయింది.

ఇప్పుడీ ముద్దుగుమ్మ మరో సినిమా చేసింది. కార్తి సరసన జపాన్ అనే సినిమాలో నటించింది. సినిమా విలక్షణంగా ఉంది. మూవీ చుట్టూ మంచి అంచనాలు నెలకొన్నాయి. కనీసం ఈ సినిమా అయినా క్లిక్ అయితే కెరీర్ ను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది అను. ప్రస్తుతం ఈ సినిమా తప్ప, ఆమె చేతిలో మరో మూవీ లేదు. జపాన్ సినిమా సక్సెస్ అయితేనే ఆమెకు మరిన్ని ఆఫర్లు వస్తాయి. లేదంటే మరో మూవీ కోసం ఎదురుచూడాల్సిందే.

First Published:  4 Nov 2023 10:17 AM GMT
Next Story