Telugu Global
Cinema & Entertainment

Animal Movie | మరో రికార్డ్ సృష్టించిన యానిమల్ మూవీ

Animal Movie - రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా మరో రికార్డ్ సృష్టించింది. అదేంటో చూద్దాం..

Animal Movie | మరో రికార్డ్ సృష్టించిన యానిమల్ మూవీ
X

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాల చిత్రం యానిమల్, బాక్సాఫీస్ వద్ద రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. థియేట‌ర్ల‌లో విడుద‌లై 4 వారాలు గ‌డుస్తున్నా సినిమా వ‌సూళ్లు తగ్గలేదు. తాజాగా ఈ సినిమా, ఇండియా బాక్సాఫీస్ వద్ద షారూక్ నటించిన పఠాన్‌ సినిమా రికార్డ్ ను బద్దలుకొట్టింది.

యానిమల్ చిత్రం 5వ వారాంతంలో అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. ఇండియాలో ఈ సినిమాకు 5 కోట్ల నెట్ వచ్చింది. తాజా వసూళ్లతో ఈ సినిమా ఓవరాల్ గా 494 కోట్లు సాధించినట్టయింది, త్వరలోనే ఇది 500 కోట్ల నెట్ సాధించబోతోంది.

ఇది కేవలం హిందీ వెర్షన్ వసూళ్లు మాత్రమే. ఇతర భాషల వసూళ్లను కూడా కలిపితే, యానిమల్ ఇండియా వసూళ్లు ఇప్పటికే 545 కోట్ల రూపాయలు దాటేశాయి. ఈ వసూళ్లతో షారూక్ నటించిన పఠాన్ ఇండియా నెట్ (రూ.543 కోట్లు)ను యానిమల్ క్రాస్ చేసినట్టయింది.

యానిమల్, భారతదేశంలో జవాన్ తర్వాత (అన్ని భాషల్లో కలిపి) బాలీవుడ్‌ లో రెండో అతిపెద్ద చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి సంబంధించి ఆల్ ఇండియా గ్రాస్ సుమారుగా 650 కోట్లు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రాస్ విలువ 890 కోట్లు.

డిసెంబర్ 1న రిలీజైన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా.. బాబీ డియోల్, అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలు పోషించారు.

First Published:  1 Jan 2024 3:08 PM GMT
Next Story