Telugu Global
Cinema & Entertainment

Anasuya | నాకు ఇది మరో రంగస్థలం అవుతుంది

Anasuya - పెదకాపు-1 సినిమాలో తనది కీలక పాత్ర అంటోంది అనసూయ. రంగస్థలం తర్వాత ఆ స్థాయిలో తనకు పేరు తీసుకొస్తుందని చెబుతోంది.

Anasuya | నాకు ఇది మరో రంగస్థలం అవుతుంది
X

పెదకాపు-1 సినిమాలో కీలక పాత్ర పోషించింది అనసూయ. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తన పాత్ర చాలా బాగుంటుందని, తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని అంటోంది. పెదకాపు-1 సినిమాలో తన పాత్ర తీరుతెన్నులు, మేకోవర్ గురించి అనసూయ ఏమంటుందో చూద్దాం..

- రంగస్థలంలో రంగమ్మత్తగా నన్ను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. ఆ పాత్ర ఒక బార్ ని సెట్ చేసింది. అయితే నేను మాత్రం విభిన్నమైన పాత్రలు చేయడానికి నా వంతుగా ప్రయత్నిస్తున్నాను. ‘విమానం’లో సుమతి పాత్రలో విభిన్నంగా కనిపించాను. ఇప్పుడు పెదకాపులో చేసిన పాత్ర కూడా చాలా బలంగా, వైవిధ్యంగా ఉంటుంది. పెదకాపు చాలా రా ఫిల్మ్. నా పాత్రలో కొన్ని బోల్డ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి.

- పెదకాపులో ప్రతి పాత్రని చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రతి పాత్రకు ఒక మేకోవర్ ఉంది. మేకోవర్ లో ఎన్ని రకాలు ఉంటాయో ఈ సినిమా చేసేటప్పుడు నేర్చుకున్నాను. ఈ సినిమా చాలా మంచి అనుభవం.

- ‘పెదకాపు’లో చాలా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాను. ఇప్పుడే ఆ పాత్ర పేరు, స్వభావం గురించి పూర్తిగా చెప్పకూడదు. ప్రేక్షకులు పెదకాపు వరల్డ్ తో కచ్చితంగా కనెక్ట్ అవుతారు. సినిమా చూసిన తర్వాత నా పాత్ర ఇంకా ప్రభావవంతంగా అనిపిస్తుంది. ఇందులో నా పేరు నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా నచ్చింది. సినిమా విడుదల తర్వాత అందరూ ఆ పేరుతోనే పిలుస్తారనే నమ్మకం ఉంది.

First Published:  22 Sep 2023 8:22 AM GMT
Next Story