Telugu Global
Cinema & Entertainment

పుష్ప-2 నుంచి బన్నీ బ్లాస్ట్‌ అప్‌డేట్

సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. సినిమా గురించి ఒక్కటే చెబుతా.. పుష్ప2 అంటే అంతా తగ్గేదేలే అంటున్నారు. కాదు పుష్ప-2 అస్సలు తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు.

పుష్ప-2 నుంచి బన్నీ బ్లాస్ట్‌ అప్‌డేట్
X

‘పుష్ప-2 ది రూల్’ మూవీ షూటింగ్ గురించి క్రేజీ అప్‍డేట్ ఇచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. హైదరాబాద్‌లో జరిగిన మంగళవారం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుష్ప గురించి చెప్పాలని అభిమానులు గోల చేస్తుంటే మూవీ షూటింగ్ అప్‍డేట్‍ను అల్లు అర్జున్ చెప్పారు.

"ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ నుంచే వచ్చా. మీకు కనిపిస్తుందో లేదో చేతులకు కొంచెం పారాణి, నెయిల్ పాలిష్ ఉంది. ఆ గెటప్ ఉంటుంది కదా.. పుష్ప 2లో గెటప్.. ఆ జాతర ఎపిసోడ్ షూట్ చేస్తున్నాం. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. పుష్ప గురించి ఇదే అప్‍డేట్. సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. సినిమా గురించి ఒక్కటే చెబుతా.. పుష్ప2 అంటే అంతా తగ్గేదేలే అంటున్నారు. కాదు పుష్ప-2 అస్సలు తగ్గేదేలే అంటూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. సినిమా వచ్చి రెండేళ్లవుతున్నా ఇంత ఉత్సాహం చూపిస్తున్న అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు బన్నీ. ఏ అభిమానికైనా హీరోలే ఇన్‌స్పిరేషన్‌.. కానీ నాకు నా అభిమానులే ఇన్‌స్పిరేషన్‌ అని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప-2 ది రూల్’ పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో 2021లో వచ్చిన ‘పుష్ప-1 ది రైజ్’ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. అల్లు అర్జున్‍ను పాన్ ఇండియా స్టార్‌ను చేసింది. ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగానూ అవార్డు దక్కించుకొని చరిత్ర సృష్టించారు అల్లు అర్జున్‍.

First Published:  12 Nov 2023 3:28 AM GMT
Next Story